మూవీడెస్క్: తెలుగు సినిమా అభిమానులకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. పండగ సీజన్‌లో బిగ్గెస్ట్ సినిమాలు విడుదలై థియేటర్లను మాస్ ఎంటర్టైన్ చేస్తాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఈసారి మూడు పెద్ద సినిమాలు బరిలో నిలవడం ఖాయం అవుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ‘గేమ్ చేంజర్,’ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్,’ విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పండగ సందర్భంగా విడుదల కానున్నాయి.
‘గేమ్ చేంజర్’ షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో తన మార్క్ చూపించాలని కష్టపడుతున్నారు.
జనవరి 9న విడుదల అవుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.
భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం, రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్‌లో మరింత హైప్ తీసుకురావాలని చూస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను అలరించనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సంక్రాంతి బరిలో ఈ సినిమా మరో పెద్దదిగా నిలుస్తుందని నందమూరి ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా పండగకి సిద్ధమవుతోంది.
ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇప్పటికే మంచి హైప్ సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి. ఈ సంక్రాంతి సినిమా పండగ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం!