
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, వెంకటేష్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నట్లు సమాచారం. దిల్ రాజు స్వయంగా హిందీలోనూ ఈ సినిమాను నిర్మించనుండగా, అనిల్ రావిపూడి కాకుండా కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ రీమేక్ హిట్ అవ్వాలంటే కొన్ని సవాళ్లు ఎదురవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, గోదావరి నేటివిటీ, భీమ్స్ సంగీతం.. ఇవన్నీ హిట్ కారణాలు. హిందీ ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు అవసరమని అంటున్నారు.
గతంలో అల వైకుంఠపురములో హిందీ రీమేక్ ఫ్లాప్ కావడంతో, ఈసారి దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మరి ఈ రీమేక్ కూడా తెలుగు వర్షన్ రేంజ్‌లో విజయాన్ని అందుకుంటుందా అనేది వేచి చూడాలి.