మూవీడెస్క్: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సిద్ధమైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి పండగను మరింత స్పెషల్ చేయనుంది.
దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం యాక్టివ్‌గా సాగుతుండగా, సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతోంది.
ఇటీవల విడుదలైన మూడు పాటలు ‘గోదారి గట్టు’, ‘మీనూ సాంగ్’, ‘పొంగల్’ ట్రెండింగ్‌లో నిలుస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాయి.
వెంకటేష్ పాడిన పొంగల్ పాటకు మంచి స్పందన రావడం విశేషం.
ఇక, టీం చేసిన ప్రోమో ఇంటర్వ్యూలు, ఫన్నీ మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ మధ్య అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి.
అంచేత ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంది.
తమ టార్గెట్ ఆడియన్స్‌కు చేరుకునేలా టీజర్స్, ట్రైలర్స్‌లో ఎమోషన్స్, కామెడీని ప్రదర్శించి మేకర్స్ అందరినీ ఆకర్షిస్తున్నారు.
ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది.
విడుదల నాటికి సినిమా హైప్ మరింత పెరుగుతుందనే నమ్మకంతో టీం పండగ వాతావరణం క్రియేట్ చేస్తోంది.
ఇప్పుడు వేదిక సిద్ధం.. సంక్రాంతికి బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఫెస్ట్ రెడీ!