మూవీడెస్క్: సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా మార్చేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ చిత్రం సంక్రాంతి సెలవుల్లో మంచి విజయాన్ని నమోదు చేస్తోంది.
మొదటి రోజే 45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, వెంకటేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
రెండో రోజుకి 33 కోట్ల గ్రాస్ రాబట్టి, రెండు రోజుల్లో మొత్తం ₹77 కోట్ల గ్రాస్‌ను దాటడం విశేషం. ఈ నంబర్లు సినిమా విజయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.
థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్ సందడి చూస్తుంటే పండుగ వాతావరణం అనిపిస్తుంది.
సినిమాలో వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి కామెడీ పంథా, ఎమోషనల్ సన్నివేశాలు ప్రధాన బలం.
పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఈ చిత్రం థర్డ్ డే బుకింగ్స్‌ను కూడా హౌస్‌ఫుల్‌తో నింపింది.
కొన్ని ప్రాంతాల్లో అదనపు షోలను ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా, ముఖ్యంగా యుఎస్ మార్కెట్‌లో 1 మిలియన్ డాలర్ల క్లబ్ చేరడానికి దగ్గరలో ఉంది.