మూవీడెస్క్: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న విడుదల కానుంది.
దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పాటలతోనే మంచి స్పందన పొందింది.
హాలిడే సీజన్‌కి సరిపోయే వినోదాన్ని అందించనున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించనుందని అంటున్నారు.
ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 13న అక్కడ ప్రీమియర్స్ జరగనున్నాయి.
లేటెస్ట్ లెక్కల ప్రకారం, ఈ సినిమా ప్రీసేల్స్ ద్వారా 44,996 డాలర్ల వసూళ్లు సాధించగా, 2537 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
కెనడాలో కూడా 148 లొకేషన్లలో 424 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు.
మొత్తానికి ట్రైలర్ రాబోయే రోజుల్లో అదిరిపోయే ఇంపాక్ట్ చూపిస్తే, బుకింగ్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సంక్రాంతి రేసులో మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నప్పటికీ, ప్రతి చిత్రానికి వీలైనంత మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు.
వినోదాత్మకంగా ఉండబోతున్న ఈ కథ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో మెప్పిస్తుందనిపిస్తోంది.
మరి ఈ సంక్రాంతి వెంకటేష్ బంపర్ హిట్ అందుకుంటాడా? చూడాల్సిందే.