fbpx
Sunday, October 20, 2024
HomeMovie Newsసంక్రాంతి స్ట్రాటజీ: దిల్ రాజు గేమ్ ప్లాన్

సంక్రాంతి స్ట్రాటజీ: దిల్ రాజు గేమ్ ప్లాన్

SANKRANTHI-STRATEGY-FOR-GAMECHANGER-FROM-DIL-RAJU
SANKRANTHI-STRATEGY-FOR-GAMECHANGER-FROM-DIL-RAJU

మూవీడెస్క్: సూపర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ పై ఎంతో నమ్మకం ఉంచారు.

ఇది ఆయనకు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.

ఈ సినిమా విజయవంతం కావడం అందరికీ ముఖ్యమని చెప్పాలి, ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏంటో కూడా ఈ చిత్రంతోనే తేలనుంది.

సంక్రాంతి హాలిడేస్ లో సాలీడ్ కలెక్షన్లు సాధించేందుకు దిల్ రాజు స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో 50 శాతం థియేటర్స్ లలో ‘గేమ్ చేంజర్’ ప్రదర్శించనున్నారు.

బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ మరియు ఎర్లీ మార్నింగ్ షోలు వంటి ప్రత్యేక ప్రదర్శనలను కూడా ప్లాన్ చేస్తున్నారు. టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా తరువాత 6 రోజుల ఫెస్టివల్ మరియు వీకెండ్ కలిపి భారీ కలెక్షన్స్ కొల్లగొడతుందని అంచనా వేస్తున్నారు.

పబ్లిసిటీపై దిల్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు, కచ్చితంగా జనాల్లోకి బాగా తీసుకెళ్తే సాలిడ్ బ్లాక్ బస్టర్ ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular