మూవీడెస్క్: విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthi Ki Vastunnam) సంక్రాంతి బాక్సాఫీస్‌కి అదిరిపోయే ఓపెనింగ్స్ ఇచ్చింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, మూడు రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
వెంకటేశ్ మాస్ అండ్ క్లాస్ యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అంతే కాకుండా 2025లో మొదటి హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఫినిష్ అయ్యింది.
వెంకటేశ్ కెరీర్‌లోనే వేగవంతంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం, మూడవ రోజు భారీ స్థాయిలో 29 కోట్ల గ్రాస్ సాధించింది.
బుక్‌మైషోలో భారీగా టికెట్లు అమ్ముడవ్వడం, థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతుండటం ఈ చిత్రానికి ఉన్న డిమాండ్‌ను చెబుతోంది.
ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన నాలుగో వెంకటేశ్ సినిమా ఇది.
ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథ, మంచి ఎమోషన్స్, అనిల్ రావిపూడి దర్శకత్వం సినిమాను బ్లాక్‌బస్టర్ రేంజ్‌కు తీసుకెళ్లాయి.
ఈ సంక్రాంతి సీజన్‌లో పూర్తి థియేటర్లను ఆకర్షించిన ఈ చిత్రం, పూర్తి రన్‌లో 200 కోట్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం వెంకటేశ్ కెరీర్‌లో మరో మెమరబుల్ హిట్‌గా నిలిచింది.