హైదరాబాద్ : భారత్ – చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన లో మరణించిన వారిలో తెలంగాణ కు సంబంధించిన కల్నల్ సంతోష్‌బాబు కూడా ఉన్నారు.
ఆయన మరణించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని, అలానే వారికి నివాస స్థలమ ఇస్తామని ప్రకటించింది. ఆ హామీ ని నెరవేర్చింది ఆ ప్రభుత్వం. భార్య సంతోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో సంతోషికి నియామక ఉత్తర్వులను అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే జాబ్ పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో నిలదొక్కుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను ఈ సందర్భంగా కోరారు.
హైదరాబాద్ లోని షేక్‌పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14లో కేబీఆర్ పార్కు ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అప్పగించారు. ఆర్డీఓ, తహసీల్దార్లతో సమక్షంలో స్థల పంచనామా నిర్వహించి ఆ స్థలాన్ని సంతీషికి స్వాధీనం చేశారు.
కల్నల్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం షేక్‌పేట మండలంలో మూడు స్థలాలను కుటుంబసభ్యులకు చూపించారు. వీటిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో స్థలం కావాలని వారు కోరగా, ఈ స్థలాన్ని కేటాయించారు. కేసీఆర్ తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కల్నల్ సతీమణి సంతోషి ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.