టాలీవుడ్: గోల్కొండ హై స్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ‘తాను నేను’ సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య ఓటీటీ లో విడుదలైన ‘ఏక్ మినీ కథ‘ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు. గోపి చంద్ తో పక్కా కమర్షియల్ సినిమాని రూపొందిస్తున్న మారుతీ ఒక చిన్న గ్యాప్ లో సంతోష్ శోభన్ తో ఒక సినిమాని రూపొందించే పనిలో పడ్డాడు. లాక్ డౌన్ సమయంలో అతి తక్కువ క్రూ తో తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా రూపొందించవచ్చని ఈ సినిమాని ముగించే పనిలో పడ్డాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఈ రోజు విడుదల చేసారు.
‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ తో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. మారుతీ సినిమాల తాలూకు ఫాంట్ తో ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో హీరో సంతోష్, హీరోయిన్ మెహ్రీన్ కనిపించారు. యూవీ కాన్సెప్ట్స్ సమర్పణలో ఎస్ కే ఎన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. మారుతీ దర్శకత్వంలో అనూప్ రూబెన్స్ సంగీతంలో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలో థియేటర్లలోనే ఈ సినిమా విడుదల అవనున్నట్టు ప్రకటించారు. ఈ మధ్యనే నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసాడు సంతోష్, ఇపుడు ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్ ప్రకటించి పాజిటివ్ వైబ్స్ ఉండే టైటిల్స్ తో ఆకట్టుకుంటున్నాడు.