టాలీవుడ్: వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో నటించి మెప్పించాడు. ‘తాను నేను’ అనే రొమాంటిక్ జానర్ సినిమాతో హీరో గా పరిచయం అయ్యి పేపర్ బాయ్ తో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే ప్రైమ్ ఓటీటీ లో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ సినిమా ద్వారా హిట్ టాక్ పొంది వరుస ఆఫర్లని పొందుతున్నాడు ఈ యువ హీరో. ప్రస్తుతం ఈ హీరో ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో పనిచేయబోతున్నాడు. దానికి సంబందించిన ప్రకటన ఈ రోజు వెలువడింది.
వైజయంతో మూవీస్ వారి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఈ మధ్య ‘జాతి రత్నాలు’ అనే సినిమాని రూపొందించి సూపర్ హిట్ సాధించారు. ప్రస్తుతం వీరు సంతోష్ శోభన్ తో సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రకటనతో పాటు ఒక చిన్న టీజర్ విడుదల చేసారు. టైటిల్ కి తగ్గట్టే టీజర్ లో ఒక క్లాసిక్ సాంగ్ మరియు మంచి ఫీల్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ పిక్చర్ తో అనౌన్స్మెంట్ తోనే సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ లో హిల్ స్టేషన్ ని చూపిస్తూ ఒక మంచి ఫామిలీ సినిమా చూపించబోతున్న ఫీల్ ఇచ్చారు.
ఈ సినిమాకి సూతింగ్ మెలోడీస్ అందించే మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. స్వప్న సినిమాస్ మరియు మిత్ర విందా మూవీస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కల్యాణ వైభోగమే’ సినిమాల్లో నటించిన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్ , రాజేంద్ర ప్రసాద్, గౌతమి మరిన్ని పాత్రల్లో నటించనున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవనుందని ప్రకటించారు.