ప్రియదర్శి హీరోగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మొదట 2024 డిసెంబర్ 20న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ పుష్ప 2 హడావిడి, రాబిన్ హుడ్ పోటీ కారణంగా వెనక్కి తగ్గారు.
తర్వాత ఫిబ్రవరి రిలీజ్ గురించి ఆలోచించినా, తండేల్, లైలా, బ్రహ్మ ఆనందం సినిమాలు రాబోవడంతో సేఫ్ సీజన్ కాదని టీమ్ మరోసారి ఆగిపోయింది. మార్చి మొదటి వారాన్ని టార్గెట్ చేసుకున్నా, ఓటీటీ డీల్ పై క్లారిటీ రాక ఆలస్యం అవుతోంది.
సారంగపాణి సినిమా లో ప్రియదర్శి తో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్, తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించగా, పీజీ విందా సినిమాటోగ్రఫీ చేశారు.
ఇంద్రగంటి గత కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, అష్టా చెమ్మా, సమ్మోహనం లాంటి హిట్స్ ఆయన క్రెడిట్‌లో ఉన్నాయి. పైగా, ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
రిలీజ్ కోసం అన్ని అనుకూలించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ సినిమా జాతకం ఎప్పుడు బాగుపడి, థియేటర్లలోకి వస్తుందో చూడాలి.