fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsసరిపోదా శనివారం.. హిట్ టాక్ వస్తే చాలు

సరిపోదా శనివారం.. హిట్ టాక్ వస్తే చాలు

SARIPODA-SANIVARAM-RELEASING-ON-29-AUG-2024
SARIPODA-SANIVARAM-RELEASING-ON-29-AUG-2024

మూవీడెస్క్: ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద హిట్లు తక్కువే వచ్చాయి. జనవరిలో విడుదలైన హనుమాన్ సినిమా మంచి హిట్ కావడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం భారీ అంచనాల మధ్య విడుదల కానుంది

అలాగే సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్వైర్ యూత్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది, ఇది కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

జూలైలో విడుదలైన కల్కి 2898ఏడీ కూడా పాజిటివ్ టాక్ తో నాలుగు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద నిలబడింది.

అయితే, మొత్తం చూసుకుంటే ఈ ఏడాది లో ఈ సినిమాలు మాత్రమే భారీ సక్సెస్‌గా నిలిచాయి. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి 100కి పైగా సినిమాలు విడుదలైనా, పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించినవి తక్కువే.

కానీ, ఆగస్టు చివరి వారంలో నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపాయి.

ఈ సినిమా హిట్ టాక్ వస్తే, దీని కోసం మాస్ ప్రేక్షకులు రికార్డ్ స్థాయిలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అలాగే, ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న విడుదల అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీనికి తోడు, ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే, టాలీవుడ్ లో మరికొన్ని వారాల పాటు థియేటర్లలో సందడి చూడొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular