మూవీడెస్క్: సరిపోదా శనివారం రివ్యూ & రేటింగ్!
కథ:
‘సరిపోదా శనివారం’ సినిమా టైటిల్ తోనే ఆడియెన్స్ ను కొత్తగా ఎట్రాక్ట్ చేసింది. మాస్ కమర్షియల్ ఫార్మాట్‌లో కొన్ని వినూత్న టచ్‌లు మిళితం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.
కథలో హీరో (నాని) అన్యాయం జరిగితే దానిని ఎదుర్కోవడానికి వారంలో కేవలం ఒక రోజునే, అంటే శనివారాన్ని ఎంచుకుంటాడు.
హీరో LIC ఏజెంట్ గా పని చేస్తూ, సోకులపాలెంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలనే నిర్ణయం తీసుకుంటాడు.
కానీ అతని ముందుకు వచ్చి నిలబడేది అతిక్రూరమైన పోలీస్ ఆఫీసర్ ఎస్ జే సూర్య. ఇక వీరి మధ్య నువ్వా నేనా అన్న పోరాటం సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది.
విశ్లేషణ:
ఒక విలన్… ఒక ప్రాంతం… ఆ ప్రాంతాన్ని కాపాడటానికి వచ్చే హీరో. ఇటువంటి ఫార్మాట్‌ని మనం చాలా సినిమాల్లో చూసినా, ఈ సినిమా ఒక అంశంలో కొత్తగా హైలెట్ అయ్యింది.
వారం అంతా హైపర్ యాక్టివ్ గా ఉండే విలన్, శనివారం మాత్రమే కోపాన్ని చూపే హీరో మధ్య కథ సాగడం కొత్తగా అనిపిస్తుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ కాన్సెప్ట్‌ను చక్కగా అల్లుకొని కథను ప్రేక్షకుల ముందుంచాడు. సినిమా మొదట్లో కొంచం నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత సెకెండ్ హాఫ్ మంచి జోరును అందుకుంది.
ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అవుతాయి. అక్కడక్కడా కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. చివరికి క్లైమాక్స్‌లో సీన్స్ అంచనాలను అందుకోవడం కొంత తడబాటు అనిపించినా, మొత్తం మీద సినిమా సంతృప్తినిచ్చేలా ఉంటుంది.
నాని నటనలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా కుదిరాయి. ఎస్ జే సూర్య తన పాత్రలో పూర్తి న్యాయం చేశాడు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రియాంక మోహన్ తన పాత్రకు తగిన విధంగా నటించింది. జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే సినిమా మరింత టైట్‌గా అనిపించేది.
కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ మంచి బలంగా ఉండటంతో ప్రేక్షకులకు కొంతవరకు సంతృప్తినిచ్చే సినిమా అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
స్టోరీ పాయింట్
నాని నటన
ఎస్ జె సూర్య
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
నిడివి ఎక్కువగా ఉండడం
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్: 3/5