టాలీవుడ్: సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఇప్పటికే ఫాన్స్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. వీరికి ఉత్సాహం నింపడానికి మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమా మోషన్ పోస్టర్ రేపు ఉదయం విడుదల చేయబోతున్నట్టు ఈ సినిమా టీం అఫిషియల్ గా ప్రకటించింది. పరశురామ్ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్ అని ఇదివరకే మహేష్ బాబు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ కి జోడీ గా కీర్తి సురేష్ నటించబోతుంది. అలాగే మరొక హీరోయిన్ కోసం ఫైటర్ హీరోయిన్ ‘అనన్య పాండే’ ని చూస్తున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి.
అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సామూహిక వేడుకలు జరుపుకోవద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కరొనతో చేస్తున్న యుద్ధం ఇలాగే కొనసాగించాలని ఇళ్లలోనే ఉంది క్షేమంగా ఉండాలని అదే అన్నిటికన్నా ముఖ్యం అని ట్విట్టర్ లో చెప్పారు మహేష్ బాబు.