టాలీవుడ్: గీత గోవిందం ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇన్ని రోజులు ఎదురుచూసి చివరకి మహేష్ బాబు తో తన తదుపరి సినిమా కన్ఫామ్ చేసుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల ఇన్నిరోజులు ఈ సినిమా షూటింగ్ కి నోచుకోలేదు. ఈ రోజే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ముహూర్తపు సన్నివేశాన్ని స్టార్ట్ చేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మహేష్ కి ఉన్న సెంటిమెంట్ ప్రకారం ముహూర్తపు షాట్ లకి రాడు. గత పది సినిమాలుగా ఇదే ఫాలో అవుతున్నాడు మహేష్. ఇపుడు కూడా ముహూర్తపు షాట్ కి రాలేదు. తన కూతురు సితార క్లాప్ కొట్టగా ముహూర్తపు షాట్ చేసారు.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్ టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని
సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎక్కువ సినిమా షూటింగ్ పార్ట్ అంతా అమెరికా లొకేషన్స్ లోనే ఉన్నట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇందులో మహేష్ కి జోడీ గా కీర్తి సురేష్ నటించనుంది. తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఒక కొత్తరకంగా ఈ సినిమాలో కథని, మహేష్ బాబుని చూపించబోతున్నట్టు పరశురామ్ తెలిపారు. ఆలా వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత థమన్ చెయ్యబోయే పెద్ద సినిమా కూడా ఇదే. అభిమానులు కూడా ఈ సరి మంచి సంగీతం ఊహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ కూడా కొత్తగా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా మొదలు పెట్టిన సందర్భంగా పరశురామ్ గురువు పూరి జగన్నాథ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.