fbpx
Wednesday, September 18, 2024
HomeMovie Newsటాలీవుడ్ లో సత్య జోరు.. నెక్స్ట్ స్టార్ కమెడియన్

టాలీవుడ్ లో సత్య జోరు.. నెక్స్ట్ స్టార్ కమెడియన్

SATYA-NEW-RISING-COMEDY-STAR
SATYA-NEW-RISING-COMEDY-STAR

మూవీడెస్క్: టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కామెడీ పాత్రలతో సత్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మత్తు వదలరా 2’ సినిమాలో అతని పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సత్య చేసిన వన్ మ్యాన్ షో ఆ సినిమా మొత్తాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. 

ఈ సినిమాతో అతను కామెడీ రంగంలో మరింత దూసుకుపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

సత్య కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి క్రమంగా తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వస్తున్నాడు. 

మొదట స్వామి రారా సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించాడు.

అతని క్యారెక్టర్ ఉంటే సినిమా తప్పకుండా నవ్వుల హోరును సృష్టిస్తుంది అనే నమ్మకంతో, సత్యను దర్శకులు ఎంచుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో వెన్నెల కిషోర్ తర్వాత సత్య కమెడియన్ గా పెద్ద హోదా పొందిన నటుడిగా చెప్పవచ్చు.

స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా అతని కామెడీ పెద్ద ప్లస్ అవుతోంది. మరి సత్య రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular