fbpx
Wednesday, April 9, 2025
HomeMovie Newsసత్యదేవ్ 'గువ్వ గోరింక' ట్రైలర్

సత్యదేవ్ ‘గువ్వ గోరింక’ ట్రైలర్

SatyaDev GuvvaGorinka TrailerReleased

టాలీవుడ్: లాక్ డౌన్ లో జనాలకి తన సినిమాల ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన నటుడు సత్యదేవ్. ఈ లాక్ డౌన్ లో తన సినిమాలు ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ , ’47 డేస్’ లాంటి సినిమాలు ఓటీటీ ల్లో విడుదల అయ్యాయి. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా ద్వారా మంచి సక్సెస్ మాత్రమే కాకుండా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం తాను నటించిన ‘గువ్వ గోరింక’ అనే మరో సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల అవుతుంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

మెకానికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేసే కుర్రాడిగా సత్యదేవ్ నటిస్తున్నాడు. సౌండ్ అంటే అస్సలు పడని పాత్రలో ఒక లోపం తో నటిస్తున్నాడు. సంగీతం అంటే ప్రాణంగా ఉండే పాత్రలో హీరోయిన్ నటిస్తుంది. సౌండ్ పడని అబ్బాయికి సంగీతం అంటే ప్రాణం అయిన అమ్మాయికి, రెండు భిన్న పార్శ్వాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది అది ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది అనేది సినిమా కథ అన్నట్టు ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది. ట్రైలర్ ప్రకారం ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ రూపొందించినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 17 నుండి అందుబాటులో ఉండబోతుంది. దీంతో పాటు సత్యదేవ్ ‘తిమ్మరుసు’ అనే సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తున్నాడు, అంతే కాకుండా తమన్నా తో పాటు ‘గుర్తుందా శీతాకాలం’ అనే రీ-మేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Guvva Gorinka Telugu Movie Trailer | Satyadev | Priyaa Lal | 2020 Latest Telugu Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular