fbpx
Saturday, May 17, 2025
HomeMovie Newsసత్యదేవ్ 'తిమ్మరుసు' ట్రైలర్

సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ట్రైలర్

Satyadev Thimmarusu Trailer

టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ వారమే థియేటర్లు తెరుచుకోవడం తో రెండు కొత్త సినిమాలు విడుదలకి సిద్ధం అయ్యాయి. అందులో సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ సినిమా ఒకటి. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు జూనియర్ ఎన్ఠీఆర్ విడుదల చేసారు. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు.

సత్యదేవ్ ఇందులో డబ్బులు ఆర్జించే లాయర్ కాకుండా అవసరం అయితే సొంత డబ్బులు పెట్టి మరీ న్యాయం కోసం పోరాడే లాయర్ అని సత్యదేవ్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సత్యదేవ్, బ్రహ్మాజీ, హీరోయిన్ ప్రియాంక మధ్య కొన్ని కామెడీ సీన్స్ టచ్ చేసారు. తర్వాత సినిమా మెయిన్ ప్లాట్ టచ్ చేసారు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక క్యాబ్ డ్రైవర్ హత్య కేసు ని మళ్ళీ ఓపెన్ చేయించి నిందితులకు వెతుకుతుంటారు. అలాంటి సమయంలో ఆ కేసు వెనక ఉన్న అసలైన ముద్దాయిలు సత్యదేవ్ ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు దానికి సత్యదేవ్ ఎలాంటి సమాధానంతో రిప్లై ఇచ్చాడు అనేది సినిమా కథ అని తెలుస్తుంది.

ఓవరాల్ గా ఈ రోల్ లో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటివరకు కొంచెం క్లాస్, సింపుల్ రోల్స్ చేసిన సత్యదేవ్ ఈ సినిమాతో యాక్షన్ పార్ట్ ని కూడా టచ్ చేస్తున్నాడు. ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఫార్మటు లో సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం లో ఈ సినిమా రూపొందింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు మరియు సృజన ఎర్రబోలు ఈ సినిమాని నిర్మించారు. కిరాక్ పార్టీ సినిమాని డైరెక్ట్ చేసిన శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. జులై 30 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.

Thimmarusu Movie Trailer 4K | Satyadev | Priyanka Jawalkar | Brahmaji | Sharan Koppisetty

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular