టాలీవుడ్: ఇండస్ట్రీ లో పది సంవత్సరాలుగా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా కొంచెం గుర్తింపు తెచ్చుకుని లాక్ డౌన్ లో ఓటీటీ లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా ద్వారా మంచి హిట్ సాధించి వరుస ఆఫర్లతో దూసుకు వెళ్తున్న హీరో ‘సత్యదేవ్‘. సత్యదేవ్ హీరోగా ‘తిమ్మరుసు’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదల తేదీ ని ఈరోజు ప్రకటించింది సినిమా టీం.
మే నెలలో సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇందులో మే 14 న చిరంజీవి ‘ఆచార్య‘ సినిమా, మే 28 న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా విడుదల అవుతున్నాయి. తిమ్మరుసు సినిమాని ఈ రెండింటి మధ్యలో మే 21 న విడుదల చేయనున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఇలా రెండు పెద్ద హీరోల సినిమాల మధ్యలో తన సినిమాని విడుదల చేస్తున్నాడు సత్యదేవ్.
సత్యదేవ్ ఈ సినిమాలో ఎలాంటి పరిస్థితిలో అయినా న్యాయం కోసం పరి తపించే న్యాయవాది పాత్రలో నటిస్తున్నాడు. ఈస్ట్ కాస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ సమర్పణలో మహేష్ కోనేరు , సృజన్ ఎరబోలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిఖిల్ తో కిరాక్ పార్టీ సినిమాని రూపొందించిన శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘అసైన్మెంట్ వాలి’ అనే టాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా మే 21 న థియేటర్లలో విడుదల అవనుంది.