fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsసత్యదేవ్ 'తిమ్మరుసు' ఫస్ట్ లుక్

సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్

Satyadev Timmarusu FirstLookReleased

టాలీవుడ్: చిన్న చిన్న క్యారెక్టర్ లు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ‘బ్రోచేవారెవరు రా’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నటుడిగా ఫుల్ బిజీ అయిపోయిన హీరో సత్యదేవ్. ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలుగా ఉన్నా కూడా ఈ రెండు సినిమాల ద్వారా చాలా గుర్తింపు వచ్చిందని ఆ తర్వాత మంచి కథలు, ఎక్కువ ఆఫర్లు వచ్చాయని పలు ఇంటర్వ్యూ ల్లో కూడా సత్యదేవ్ తెలిపాడు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ‘తిమ్మరుసు’. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఇవాల విడుదల చేసారు.

ఈ సినిమాలో సత్యదేవ్ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్టు అర్ధం అవుతుంది. ‘అసైన్మెంట్ వాలి’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతుంది. ఫస్ట్ లుక్ లో పాత కాలం ‘ఎజ్ది’ బండి పై ఒక సూట్ కేస్ పట్టుకుని కొత్త లుక్ లో సత్యదేవ్ కనిపించాడు. ఈ సినిమా టీజర్ డిసెంబర్ 9 న విడుదల అవబోతుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు ,సృజన్ ఎరబోలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమలో సత్యదేవ్ కి జోడీ గా టాక్సీ వాలా ఫేమ్ ప్రియాంక జవల్కర్ నటిస్తుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular