టాలీవుడ్: చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగిన సత్యదేవ్ లాక్ డౌన్ సమయంలో వరుసగా ఓటీటీ రిలీజ్ లు చేసి ఓటీటీ స్టార్ అని కూడా పిలిపించుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో విడుదలైన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత హీరోగా చాలా బిజీ అయ్యాడు. హీరో గానే కాకుండా ఏదైనా మంచి పాత్ర వస్తే సత్య దేవ్ మంచి ఛాయస్ అని ఇండస్ట్రీ లో చాలా పాత్రలకి సత్య ని ఎంచుకుంటున్నారు మేకర్స్. సత్యదేవ్ ప్రస్తుతం ‘తిమ్మరుసు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో న్యాయం కోసం పోరాడే ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు.
బ్యాక్ డ్రాప్ లో రవి బాబు వాయిస్ తో ‘తెలివికీ మూర్ఖత్వానికి ఒక సన్నని గీత ఉంటుంది రా.. ఆ గీతానికి ఇటు వైపు ఉన్నోడు తెలివిగలవాడైతే అటు వైపు ఉన్నోడు మూర్ఖుడు’ అనగా దానికి సమాధానంగా ‘కానీ ఆ గీతకి అటువైపు ఉన్న న్యాయం వైపు నేను పోరాడుతా ‘ అనే డైలాగ్ తో సత్య ఎంట్రీ ఇస్తూ ఫైట్ బ్యాక్ డ్రాప్ చూపిస్తారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు మరియు సృజన్ ఎర్రబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరన్ కొప్పిశెట్టి అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. దాదాపు విడుదలకి రెడీ అయిన ఈ సినిమా థియేటర్ లు తెరచుకోగానే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.