fbpx
Friday, April 4, 2025
HomeMovie Newsన్యాయం కోసం సత్యదేవ్ 'తిమ్మరుసు'

న్యాయం కోసం సత్యదేవ్ ‘తిమ్మరుసు’

Satyadev Timmarusu TeaserReleased

టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘తిమ్మరుసు‘. ‘బ్రోచేవారెవరు రా’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి సినిమాల తర్వాత సత్యదేవ్ క్రేజ్ తో పాటు సినిమాల సంఖ్య కూడా పెరిగింది. దాంతో పాటు సత్యదేవ్ కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. సత్యదేవ్ ప్రస్తుతం చేస్తున్న ‘తిమ్మరుసు’ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ‘అసైన్మెంట్ వాలి’ అనే టాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో సత్యదేవ్ మొదటి సారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

టీజర్ ద్వారా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది స్పష్టంగా చూపించారు. లాయర్ వృత్తిలో ఉండి డబ్బు కోసం కాకుండా న్యాయం కోసం దేనికైనా సిద్దపడే పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. అసైన్మెంట్ లోడింగ్ అంటూ టీజర్ ముగించారు. ఇప్పటి వరకు సత్యదేవ్ చేసిన క్యారెక్టర్ లు చూసుకుంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మొదటి నుండి విలక్షణమైన పాత్రలు చేస్తూ ప్రతి సారి తనని తాను నిరూపించుకుంటున్నాడు. ‘కిర్రాక్ పార్టీ’ సినిమాని రూపొందించిన శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు , సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ కి జోడీ గా ఈ సినిమాలో టాక్సీ వాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ నటిస్తుంది.

Thimmarusu Telugu Movie Teaser | Satyadev | Priyanka Jawalkar | Sharan Koppisetty | Telugu FilmNagar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular