మూవీడెస్క్:టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా సత్యదేవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్యదేవ్ పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు.
‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
‘తిమ్మరుసు’, ‘స్కైలాబ్’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’ లాంటి సినిమాలతో సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు.
మంచి కథలు ఎంచుకుంటాడనే పేరున్నప్పటికి ఎందుకనో హీరోగా సక్సెస్ లు మాత్రమే అందుకోలేకపోతున్నాడు.
ఓటీటీలో సత్యదేవ్ కి కొంత మార్కెట్ ఉంది. ఆయన సినిమాలకి ఓటీటీ రైట్స్ ద్వారా 60 శాతం రికవరీ వస్తుందంట.
లోబడ్జెట్ తో సత్యదేవ్ తో మూవీస్ ప్లాన్ చేసుకుంటే కమర్షియల్ సక్సెస్ లు అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా ఆయన కొత్త సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘జీబ్రా’ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాని పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ‘ఓల్డ్ టౌన్ పిక్చర్స్’ బ్యానర్ల పై ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ నిర్మించారు.
ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీపై ఏకంగా 20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారంట.
సినిమా కంటెంట్ డిమాండ్ చేయడంతో గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కించారని టాక్.
మూవీలో సత్యరాజ్, డాలీ ధనుంజయ్, ప్రియా భవానీ శంకర్, సునీల్, సత్య లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు.
అయిన కూడా సినిమా బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ తో కంటెంట్ బజ్ క్రియేట్ చేస్తే అప్పుడు సినిమాకి మంచి అయిన బిజినెస్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారంట.