మూవీడెస్క్: కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సత్యం సుందరం సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది.
తమిళంలో ఒక రోజు ముందే విడుదలైన ఈ మూవీకి తెలుగులో కూడా మంచి స్పందన లభిస్తోంది.
‘96’ ఫేమ్ సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భావోద్వేగ భరిత చిత్రంలో కార్తి, అరవింద్ స్వామి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
ఈ చిత్రానికి ముందే ఉన్న అంచనాల వలన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
నటీనటుల యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉందని, సినిమా ప్రేక్షకులను భావోద్వేగాలతో ఆకట్టుకుంటోందని అభిప్రాయపడుతున్నారు.
సత్యం సుందరం మంచి కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, తెలుగు ప్రేక్షకులు ఈ డబ్బింగ్ చిత్రాన్ని స్ట్రయిట్ తెలుగు సినిమాలా అనిపించేలా ఆదరిస్తున్నారు.
మొదటిరోజు మంచి ఆక్యుపెన్సీ సాధించడంతోపాటు పాజిటివ్ మౌత్ టాక్ కూడా బాగా స్ప్రెడ్ అవుతోంది.
దసరా సెలవులు కూడా రావడంతో వీకెండ్ తరువాత కూడా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అంచనా. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తోంది.
మరి సత్యం సుందరం తెలుగులో ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.