టాలీవుడ్: రాజకీయాల్లోకి వెళ్లి కం బ్యాక్ అయ్యాక పవన్ కళ్యాణ్ సినిమాల్లో దూకుడు చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ గా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ నెలలో విడుదల అవనుంది. హిందీ లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. హిందీ లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తెలుగులో చాలా మార్పులు చేసారు. తెలుగు లో హీరో కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆడ్ చేసి హీరో ఇమేజ్ దృష్ట్యా కొన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ని కూడా జోడించారు. ఈ రోజు ఈ సినిమానుండి ‘సత్యమేవజతే’ అంటూ సాగే పాటని విడుదల చేసింది సినిమా టీం.
ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి సంగీతం అందించారు. ఈ పాట రాయడానికి రామ జోగయ్య శాస్త్రి పెద్దగా కష్టపడినట్టు అనిపియ్యడం లేదు. ఎందుకంటే ఈ పాట లోని సాహిత్యం సరిగ్గా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ కారెక్టర్ కి సరిపోతుంది అన్నట్టుగా ఉంది. శంకర్ మహదేవన్, పృద్వి, థమన్ ఈ పాటని ఆలపించారు. ఓహ్ మై ఫ్రెండ్, ఎం.సి.ఏ సినిమాలని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.