కోల్‌కతా: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చాతీలో నొప్పి ఫిర్యాదుతో కోల్‌కతాలో ఆసుపత్రిలో చేరారు. భారత మాజీ కెప్టెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ తేలికపాటి కార్డియాక్ అరెస్ట్ తో బాధపడుతున్నారని మరియు అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సౌరవ్ గంగూలీ తేలికపాటి కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతుందని మరియు ఆసుపత్రిలో చేరినట్లు విన్నందుకు విచారంగా ఉంది” అని ఆమె ట్వీట్ చేసింది.
“అతనిని త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నా ఆలోచనలు మరియు ప్రార్థనలు అతనితో మరియు అతని కుటుంబంతో ఉన్నాయి!” ఆమె ట్వీట్ చేసింది.
ప్రస్తుతం డాక్టర్ సరోజ్ మోండల్ పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం సౌరవ్‌కు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్పోర్ట్స్ జర్నలిస్టు బొరియా మజుందార్ గంగూలీ అస్వస్థతకు సంబంధించి ట్విటర్‌లో వివరాలు వెల్లడించారు.
ఉదయం నుంచే ఆయన నలతగా ఉన్నారని తెలిపారు. యాంజియో ప్లాస్టీ అనంతరం సౌరవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఇక సౌరవ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.