న్యూఢిల్లీ: భారత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ, బంగారు ఆభరణాలపై రుణం తీసుకునే వారికి ఒక శుభవార్తను తెలిపింది. ఎస్‌బీఐలో బంగారు రుణాలు తీసుకునేవారికి వడ్డీరేట్లపై రాయితీని ప్రకటించింది.
బంగారు రుణాల వడ్డీరేట్లపై సుమారు 0.75 శాతం వరకు రాయితీని అందించనుంది. అయితే బంగారు రుణాలపై ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎస్‌బీఐ తన బంగారు రుణాలపై ఇప్పటి వరకు 7 నుండి 29 శాతం వరకు వడ్డీరేట్లను అమలు చేస్తోంది. ఎస్‌బీఐ బంగారు లోన్‌లను ఇకపై యోనో యాప్ ద్వారా కూడా రుణాలను పొందవచ్చని తెలిపింది.
అతి తక్కువ పేపర్ వర్క్ మరియు తక్కువ ప్రాసెసింగ్ టైంతో గోల్డ్‌లోన్స్ ను యోనో యాప్ ద్వారా పొందవచ్చు. దేశంలో కరోనా మహమ్మారి రాకతో ఖాతాదారులు అధికంగా ఇలాంటి గోల్డ్ లోన్న్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అలాగే కరోనా సమయంలో గోల్డ్ లోన్స్ కూడా గణనీయంగా పెరిగాయని కంపెనీ తెలిపింది.