న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఇంకా పండుగలు రాక ముందే తమ రిటైల్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. బ్యాంకు తాము అందించే రకరకాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇంతకౌ ముందు గృహ రుణాలపై ఇచ్చిన ఆఫర్ ప్రకారం 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేసినట్లు ప్రకటించింది.
ఇప్పుడు ఎస్బీఐ కారు, బంగారం మరియు వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను నూరు శాతం రద్దు చేసినట్లు బ్యాంకు తెలిపింది. కాగా, ఈ ప్రాసెసింగ్ ఫీజు రద్దు ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. దానితో పాటు వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు అని తెలిపింది.
అలాగే తమ వినియోగదారులు యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు ఎస్బీఐ బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు ప్రత్యేక వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది. అలాగే యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను కూడా పొందవచ్చని తెలిపింది.