fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshఏపీ లో 1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు

ఏపీ లో 1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు

SCHOOLS-CLOSED-IN-AP-AMID-COVID-SURGE

అమరావతి : దేశంలో కరోనా రోజు రోజుకు తన వ్యాప్తిని విస్తృతంగా పెంచుకుంటూ పొతోంది. రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమొదు అవుతున్నాయి. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి హై లెవెల్ కమిటీ తో భేటీ అయ్యారు.

ఈ భేటీలో కరోనా పై నియంత్రణ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కరోనాపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని మంత్రి తెలిపారు.

కాగా ఈ భేటీ లో 1వ తరగతి నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి(ఏప్రిల్‌20) సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు విద్యాపరంగా నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular