హైదరాబాద్ / అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు. పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు కూడా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మొదట వర్షం ఎక్కువ ఉన్న జిల్లాల్లో స్కూళ్ళకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఇంకా వర్షం ముప్పు తగ్గనందున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విధ్యార్థుల క్షేమం ధృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళకు సెలవు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే కాకుండ అన్ని ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుంది.
ప్రైవేటు యాజమాన్యాలు సెలవు ఇవ్వకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు.