న్యూఢిల్లీ: భారత్ లో మరో కంపెనీ తమ వ్యాపారాన్ని మూసి వేసింది. సింగపూర్‌కు చెందిన దిగ్గజ సంస్థ అయిన సీ లిమిటెడ్(ఎస్.ఈ.ఏ) తమ ఆన్ లైన్ షాపింగ్ వ్యాపారాన్ని భారత్‌లో మూసివేస్తున్నట్లు ఇవాళ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
సీ లిమిటెడ్ సంస్థ షాపీ పేరుతో భారత్ లో ఈ కామర్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇటీవలే సదరు కంపెనీ ఫ్రాన్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొన్ని వారాల్లోనే భారత్‌లో కూడా తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు వెల్లడించడం చర్చనీయాంశం.
కాగా భారత్‌లో తమ షాపీ వ్యాపారాన్ని మూసివేయడానికి సీ లిమిటెడ్ సంస్థ ప్రీప్లాన్డ్ గా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తమ పోర్టల్ లో కొత్త విక్రేతలను రిక్రూట్ చేయడాన్ని షాపీ నిలిపివేసినట్లు సమాచారం.
భారత్ జాతీయ భద్రత దృష్ట్యా ఇటీవలే దాదాపు 53 పైగా యాప్స్‌ను బ్యాన్ చేసింది. వీటిలో సీ లిమిటెడ్ సంస్థ రూపొందించిన గరెనా ఫ్రీ ఫైర్ యాప్ కూడా ఉంది. ఈ యాప్ భారత్‌లో గణనీయమైన ఆదరణను పొందింది.
కాగా ఫ్రీ ఫైర్ యాప్‌పై ప్రభుత్వం నిషేధం విధించడంతోనే సీ లిమిటెడ్ సంస్థ తమ నేతృత్వంలోని షాపీ ఈ కామర్స్ సంస్థను మూసివేసినట్లుగా భావించారు, కానీ ఇండియాలో తమ సేవల షట్‌డైన్ నిర్ణయానికి ఫ్రీ ఫైర్ బ్యాన్‌తో ఎలాంటి సంబంధం లేదని షాపీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.