టాలీవుడ్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. మొన్నటి దాకా ‘నో పెళ్లి’ అంటూ హంగామా చేసి ఇపుడు హీరోయిన్ తో డ్యూయెట్ పాడుతున్నాడు. ఈ సినిమా నుండి ‘హే ఇది నేనేనా’ అంటూ సాగే డ్యూయెట్ సెకండ్ సింగల్ లాగా విడుదలైంది.
సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రస్తుతం యు ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సోలో లైఫ్ నుంచి ప్రేమలో పడ్డాక లైఫ్ ఎలా మారిపోయింది అనే థీమ్ లో ఉన్న లిరిక్స్ ఆకట్టుకున్నాయి. అలాగే పాట లో హీరోయిన్ నాభా నటేష్ తో పాటు వైజాగ్ లో చూపించే విజువల్స్ ఆకట్టుకున్నాయి. ”అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట…ఈ పాట..” అంటూ ఈ పాటని విడుదల చేసారు.
వరుసగా బ్లాక్ బస్టర్లు అందిస్తున్న థమన్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన ఈ సినిమాని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం ముగించుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తారు అనే ఒక రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.