బాలీవుడ్: ఒక భాషలో హిట్ అయిన పాటని మరో భాషలో రూపొందించడం సాధారణ విషయమే. కొన్ని సార్లు హిట్ పాట కదా ఇక్కడ కూడా హిట్ వస్తుంది అని , కొన్ని సార్లు ఇలాంటి పాటే కావాలని పెట్టించుకోవడం లాంటివి వింటూనే ఉంటాం. ఇపుడు మాట్లాడుకునేది సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే‘ సినిమాలోని ‘సీటీ మార్’ పాట గురించి. ఈ రోజు ఈ పాట ఫుల్ వీడియో ని విడుదల చేసింది సినిమా టీం. రంజాన్ సందర్భంగా మే 7 న ఈ సినిమా ఒకేసారి థియేటర్లలో మరియు జీ ప్లేస్ స్టూడియో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవనుంది. ఈ రోజు విడుదలైన ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
తెలుగు లో ఈ పాట ని కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ హిందీ లో కూడా కంపోజ్ చేసాడు. ఇదివరకు బన్నీ నటించిన ‘ఆర్య’ సినిమాలోని రింగ రింగ పాటని ‘డింక చికా డింక చికా’ అంటూ ఒకేసారి హిట్ ట్యూన్ ఇచ్చారు. ఇపుడు మరో సారి బన్నీ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘సీటీ మార్’ పాటని ‘సీటీ మార్’ అంటూనే విడుదల చేసారు. ఇక ఈ పాటలో సల్మాన్ ఖాన్ స్టెప్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ పాటని ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్ ని, దేవి శ్రీ ప్రసాద్ ని మెచ్చుకున్నాడు సల్మాన్ ఖాన్.