టాలీవుడ్: కెరీర్లో వరుసగా కొన్ని ప్లాప్ లు చూసిన గోపీ చంద్ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమం లో దర్శకుడు సంపత్ నంది తో మరో సారి జత కలిసాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఇదివరకు ‘గౌతమ్ నంద’ సినిమాలో నటించిన గోపీచంద్ ఈ సారి ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా లో నటించాడు. ‘సీటీ మార్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకి సంబందించిన విడుదల అప్ డేట్ ఈ రోజు విడుదల చేసారు. కబడ్డీ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
కబడ్డీ టీం ని తయారుచేసే కోచ్ పాత్రలో గోపీ చంద్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపి చంద్ కి జోడీ గా తమన్నా నటిస్తుంది. మరొక టీం కోచ్ గా తమన్నా నటిస్తుంది. ఈ మధ్య స్పోర్ట్స్ డ్రామా లు బాగానే క్లిక్ అవుతున్న తరుణంలో మరో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు గోపి చంద్.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతంలో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఖచ్చితంగా అవుట్ స్టాండింగ్ ఉండాలి కాబట్టి మణి శర్మ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 3 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.