టాలీవుడ్: హర్ష కనుమల్లి హీరోగా ‘సెహరి’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం తో ఈ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ లభించింది. ఈ సినిమాలో హర్ష కి జోడీ గా సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబందించిన మొదటి పాట ఈ రోజు విడుదలైంది. సెహరి అంటూ సాగే టైటిల్ ట్రాక్ ఈరోజు విడుదలైంది.
సెహరి – అంటే సెలెబ్రేషన్, నా జీవితం లో లేనిదే అది నన్నొక్కసారి చూడే అంటూ మీనింగ్ వచ్చే సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంది. ‘కచడా కచడా హోగయా, అర్థమైతలేదయా, అచ్చట ముచ్చట లేదయా, వసపడతలే ఏందయ్యా — నన్నొక్కసారి చూడవే సెహరి..’ అంటూ ఈ టైటిల్ ట్రాక్ కొనసాగింది. ఈ పాటకి ప్రశాంత్ విహారి సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం తో పాటు లేటెస్ట్ తెలుగు సింగింగ్ సెన్సేషన్ రామ్ మిరియాల గాత్రం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.
యష్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ లిరిక్ వీడియో లో ఆకట్టుకుంది. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, కోటి మరిన్ని పాత్రల్లో కనిపిస్తున్నారు. వర్గో పిక్చర్స్ బ్యానర్ పై జిషు రెడ్డి మరియు శిల్ప చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా హర్ష కనుమల్లి అందించడం విశేషం. ద్వారకా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని మంచి రిలీజ్ టైం కోసం ఎదురుచూస్తుంది.