మూవీడెస్క్: టాలీవుడ్‌లో కొత్తగా ఒక ఆసక్తికరమైన కాంబినేషన్‌పై చర్చలు మొదలయ్యాయి. నేచురల్ స్టార్ నాని, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలసి ఒక ప్రాజెక్ట్ చేయనున్నారనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల, నానితో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారట. నాని కూడా తన తదుపరి ప్రాజెక్టులలో ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా శేఖర్ కమ్ముల దగ్గర సిద్ధంగా ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కథానాయికగా సాయి పల్లవిని తీసుకునే యోచన కూడా ఉందట. సాయి పల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ‘ఫిదా,’ ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాలు వచ్చాయి.
ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ సెట్టయితే, ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇవ్వడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్‌తో ‘కుబేర’ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు, ఇక నానితో చేసే సినిమాపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నాని తన ప్రస్తుత ప్రాజెక్టులను గట్టిగా ప్లాన్ చేస్తూ, కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. నాని నెక్స్ట్ హిట్ 3 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.