కోలీవుడ్: ఇపుడు ప్రతి ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ డైరెక్టర్లు యాక్టింగ్ వైపు అడుగులు వేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తెలుగులో తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. తమిళ్ లో గౌతమ్ మీనన్ నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం మరో డైరెక్టర్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో డైరెక్టర్ సముద్ర ఖని ఇపుడు తెలుగు, తమిళ్ లో మంచి నటుడిగా పేరు సంపాదించాడు. తెలుగులో ‘7 /జి బృదావన కాలనీ’, ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’ లాంటి సినిమాల ద్వారా సుపరిచితం అయినా డైరెక్టర్ సెల్వ రాఘవన్. ఈయన నుంచి వచ్చే సినిమాలకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ట్రెండ్ కి ముందుగా సినిమాలు తీస్తాడు అనే పేరు కూడా ఈ డైరెక్టర్ కి ఉంది.
ప్రస్తుతం ఈ డైరెక్టర్ నటుడిగా కూడా అడుగులు వేస్తున్నాడు. కీర్తి సురేష్ నటిస్తున్న ‘సాని కాయిదం’ అనే సినిమాలో ఒక పాత్రలో సెల్వ రాఘవన్ నటిస్తున్నాడు. దీనితో పాటు ఈ రోజు మరొక స్టార్ హీరో సినిమాలో కూడా సెల్వ రాఘవన్ నటించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. నయనతార తో ‘కో కో కోయిల’ , శివ కార్తికేయ తో ‘డాక్టర్’ సినిమాని రూపొందించిన నెల్సన్ దిలీప్ రెండవ సినిమా విడుదల అవకముందే మూడవ సినిమాకే స్టార్ హీరో విజయ్ తో చేసే అవకాశం పొందాడు. విజయ్ తో ప్రస్తుతం ‘బీస్ట్’ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కోసం సెల్వ రాఘవన్ నటించబోతున్నట్టు ఈ రోజు ప్రకటించారు. సెల్వ రాఘవన్ సినిమాల్లో నటిస్తూనే ఆయన దర్శకత్వంలో ఇంకా ఎంతో మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.