fbpx
Wednesday, January 15, 2025
HomeInternationalగ్రీన్‌ కార్డుల కోటా పరిమితిని తీసేసే బిల్లుకి సెనేట్‌ ఆమోదం

గ్రీన్‌ కార్డుల కోటా పరిమితిని తీసేసే బిల్లుకి సెనేట్‌ ఆమోదం

SENATE-APPROVED-GREENCARD-QUOTA-REMOVAL-BILLL

వాషింగ్టన్‌: యూఎస్ లో చాలా కాలంగా గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది భారతీయుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డుల మంజూరులో దేశాలకు విధించిన కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్‌ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది.

ప్రతి సంవత్సరం మంజూరు చేసే గ్రీన్‌ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమిగ్రెంట్స్‌ యాక్ట్‌ని సెనేట్‌ ఆమోదించింది. అమెరికాకు ఉద్యోగానికి వచ్చే విదేశీయుల్లో అత్యధిక శాతంలో భారతీయులు ఉండడం, గ్రీన్‌ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఏళ్లకి ఏళ్లు ఎదురు చూపులు తప్పడం లేదు.

అయితే సవరించిన ఈ బిల్లుని కొన్ని మార్పులతో సెనేట్‌ ఆమోదించడంతో ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అధ్యక్షుడు సంతకం చేస్తే ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్‌ కార్డులు జారీ చేస్తారు. ఏప్రిల్‌ నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు మాత్రమే 8 లక్షల మందికి పైనే ఉన్నారు.

గత ఏడాది జూలై 10న ఎస్‌386 బిల్లుని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ఆమోదించింది. అయితే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుకు చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసి సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలు చైనా నుంచి వచ్చిన వారికి ప్రతికూలంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular