మూవీడెస్క్: యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన కొత్త చిత్రంతో బిజీగా ఉన్నాడు.
లూజర్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన అభిలాష్ రెడ్డి, శర్వా నెక్స్ట్ సినిమాను రూపొందిస్తుండగా, రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌తో స్టోరీ కొత్తగా ఉంటుందని సమాచారం.
సినిమా టైటిల్‌ను “జానీ”గా ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రంలో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ కనిపించనున్నారని సమాచారం.
గత కొంతకాలంగా ఈ వార్తలు హల్‌చల్ చేస్తుండగా, ఆయన ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
శర్వానంద్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్టే, రాజశేఖర్ క్యారెక్టర్ కూడా సినిమా స్ర్కీన్‌ప్లేకు ప్రధాన బలంగా నిలవనుందని టాక్.
ఇక రాజశేఖర్ కోసం ప్రత్యేకంగా స్టైలిష్ లుక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, తన పాత్రకు గాను రాజశేఖర్ సుమారు 3 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఆయన ఫామ్‌లో లేనప్పటికీ, శర్వా సినిమాతో తిరిగి ఫోకస్‌లోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
గతంలో “గోరింటాకు” వంటి విజయాలు అందుకున్న ఆయన, ఆ తర్వాత పెద్దగా హిట్ సినిమా లేక ఇబ్బంది పడ్డారు.
కానీ, ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో, ప్రేక్షకుల్లో కొత్తగా కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు.