టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ హీరోలు అంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు టాప్ హీరోలు అంటే వీళ్ళే గుర్తొచ్చేవాళ్ళు. 1990 నుండి 2005 వరకు వీళ్ళే టాప్ హీరోలుగా కొనసాగారు. ఆ తర్వాత ఇండస్ట్రీ లో కొత్తదనం, కొత్త కథలు, కొత్త హీరోలు రావడం తో సీనియర్ హీరోలు కొంత వెనుకబడ్డారు. మధ్యలో కొన్ని సూపర్ హిట్ లు కొట్టినప్పటికీ మునుపటి ఫార్మ్ లో అయితే లేరు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి కం బ్యాక్ అయ్యాక వరుస సినిమాలు లైన్ లో పెట్టి పూర్తి చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు వీళ్ళ సినిమాలు ఒకే నెలలో అతి తక్కువ రోజుల గ్యాప్ లోనే విడుదల అవుతూ పాత రోజులని గుర్తుకు తెస్తున్నాయి.
ఒక నాగార్జున తప్ప చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు మే లో విడుదల అవుతూ టాక్ అఫ్ టాలీవుడ్ గా నిలిచాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య‘ సినిమా మే 13 న విడుదల అవబోతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘అసురణ్’ కి రీమేక్ గా రూపొందిన ‘నారప్ప‘ సినిమా మే 14 న విడుదల అవబోతుంది. వీళ్లిద్దరి సినిమాలు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల అవుతుంది. వీరితో పాటు మరో సీనియర్ హీరో బాలకృష్ణ సినిమా మే 28 న విడుదల అవబోతుంది. మామూలుగా 90 ల్లో వీళ్ళ సినిమాలు ఒకేసారి సంక్రాంతికో దసరాకో ఇలా ఒక్కోరోజు గ్యాప్ లో విడుదల అయ్యేవి. ఇలా మొదటి సారి సమ్మర్ లో ఇంత తక్కువ గ్యాప్ లో టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతూ పాత టాలీవుడ్ రోజులు గుర్తుకు తెస్తున్నాయి.