ముంబై: ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభాలతో 80664 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,586 వద్ద స్థిరపడ్డాయి.
కాగా, ఇవాళ ఫార్మా మరియు ఆయిల్ & గ్యాస్ రంగాలు రాణించడం మార్కెట్ లాభాలకు ఊతమిచ్చాయి. పీఎస్యూలో, ఓఎన్జీసీ షేర్లు జీవితకాల గరిష్టాలను తాకాయి. 2.5% వృద్ధి కనబరచి షేర్ విలువ రూ. 314.770 కు చేరింది.
ఫలితంగా, మిగతా కంపెనీలైన శ్రీరాం ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ మరియు జొమాటో షేర్లు ఇవాళ టాప్ గెయినర్లుగా నిలిచాయి.