ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై లోని దలాల్ స్ట్రీట్ లో బడ్జెట్ ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్న దేశీయ సూచీలు అయిన సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండూ ఈ రోజు ఆరంభంలోనే ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకాయి.
ఆ తరువాత అవి మరింత ఎగిసి సెన్సెక్స్ 528 పాయింట్లు పెరిగి 50,325 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 163 పాయింట్లు పెరిగి 14,810 గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు ఇప్పుడు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
లాభాల జబితాలో ప్రధానంగా రిలయన్స్, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్ల లాభాలకు సూచీలకు మంచి మద్దతునిస్తున్నాయి. వీటితో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ లు కూడా టాప్ గెయినర్స్‌గా కొనసాగుతుండగా, మరోవైపు, మారుతి, కోటక్ బ్యాంక్, ఎస్బిఐ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలను చవి చూస్తున్నాయి.