మూవీడెస్క్: టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన హిట్ సినిమాలకు రెండో భాగాన్ని తీసుకురావడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే ఈ ట్రెండ్ చాలా వరకు సక్సెస్ సాధించడంతో మరిన్ని ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
తాజాగా, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, అజయ్ భూపతి తమ హిట్ సినిమాలకి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
హనుమాన్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ, తన గత సక్సెస్ జాంబీ రెడ్డి సినిమాకు రెండో భాగాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అదే విధంగా, మంగళవారం సినిమాతో హిట్ కొట్టిన అజయ్ భూపతి సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ హారర్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కడంతో, రెండో భాగాన్ని మరింత భయాందోళనలతో తెరకెక్కించనున్నారట.
జాంబీ రెడ్డి సీక్వెల్ లో కొత్త క్యాస్టింగ్ పై మేకర్స్ పని చేస్తున్నట్లు టాక్.
అదే సమయంలో మంగళవారం పార్ట్-2 లో పాయల్ రాజపుత్ కాకుండా మరో హీరోయిన్ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, త్వరలోనే ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులపై అప్డేట్ రాబోతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరి ఈ సీక్వెల్స్ ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి!