శంషాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) ప్రతిష్టాత్మకమైన అవార్డు ఒకటి దక్కింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం నిలిచింది.
ఈ అవార్డు ఆ విమానాశ్రయం తమ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, మరియు సదరు ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఆర్‌జీఐఏకు ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు అందజేసినట్లు జీఎంఆర్ వర్గాలు ప్రకటించాయి.
ఈ సర్వీస్ క్వాలిటీ అవార్డు పొందడం పట్ల జీఎంఆర్ హెచ్‌ఐఏల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు తమ విమానాశ్రయంలో తమ ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడంలోనూ మరియు కోవిడ్ సమయంలో మరింత అప్రమత్తం చేసిందని ఎయిర్‌పోర్ట్ ఈడీ, సౌత్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు.