అమరావతి: ఏపీ అసెంబ్లీ లో ఇవాళ పల్లు బిల్లులకు ఆమోదం లభించింది. మంత్రి సత్యకుమార్ ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరు పునరుద్ధరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
కాగా, అంతకు ముందు గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అయితే, ఇక్కడ కీలక బిల్లులు సభలో ఆమోదం పొందుతుంటే వైఎస్ జగన్ ఢిల్లీలో దొంగ ధర్నాలంటూ తిరుగుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేస్తుంటే అది ప్రవేశ పెట్టీన వైఎస్ జగన్ అసెంబ్లీ లో ఉండి తన అభిప్రాయం చెప్పాల్సింది పోయి బాధ్యత లేకుండా తిరుగుతున్నారని అన్నారు.