టాలీవుడ్: చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న బుల్లి తెర హీరో ‘సాగర్‘ అలియాస్ ఆర్కే నాయుడు.మొగలి రేకులులో ఆయన నటించిన ఆర్కే నాయుడు పాత్ర సాగర్‌కి మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత సాగర్ కొన్ని సినిమాల్లో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటించారు. తర్వాత హీరో గా ‘సిద్దార్థ’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. బుల్లి తెర పై సక్సెస్ వచ్చినప్పటికీ వెండి తెరపై ఆశించినంత సక్సెస్ రాలేదు ఈ హీరోకి. అందుకే తన తదుపరి ప్రయత్నం గా ‘షాదీ ముబారక్’ అనే లవ్ స్టోరీ తో వస్తున్నాడు .
ఒక వైపు పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు లో- బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు చేసి కొత్త వాల్లని ప్రోత్సహించడం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు- శిరీష్- లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లపై ఆసక్తిని చూపే ఈ నిర్మాత ఇప్పుడు సీరియల్ స్టార్‌తో ఓ ప్రేమ కథను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటు ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ మూవీ ద్వారా ద్రిష్య రఘునాధ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.పద్మశ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.