బాలీవుడ్: నాని హీరోగా నటించి సూపర్ హిట్ అయిన సినిమా ‘జెర్సీ’. ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అయింది, ఇన్ని కలెక్షన్స్ సాదించించి అనడం కన్నా సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృదయాల్ని తట్టింది అని చెప్పడం లో సందేహం లేదు. ఈ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరో గా రీ-మేక్ చేస్తున్నారు. తెలుగు లో అర్జున్ రెడ్డి ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీ మేక్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత షాహిద్ కపూర్ మరోసారి టాలీవుడ్ సినిమానే రీ మేక్ చేస్తున్నాడు. ఒక ఎమోషనల్ జర్నీ తో కూడుకున్న సినిమాని హిందీ లో తీస్తున్నాడు. ఈ సినిమా నే కాకుండా ఈ సినిమా షూటింగ్ ప్రయాణం కూడా తనకి చాలా ఎమోషనల్ అని ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.
ఈ సినిమాకి కూడా తెలుగు కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి నే ఎంచుకున్నాడు షాహిద్. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయింది. దాదాపు 47 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసారు. ఇలాంటి కరోనా పరిస్థితుల్లో ఇంత వేగంగా ఈ సినిమా పూర్తవడం ఆశ్చర్యం గా ఉందని తెలిపారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ టెక్నిషియన్ కి ఉన్న అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడిందని తెలిపారు . ఈ సినిమా ఒక మంచి స్ఫూర్తి నింపే సినిమా అని తెలుగులో మాదిరిగానే హిందీలో కూడా అలాంటి ఫలితం వస్తుందని ఇదొక మంచి జ్ఞాపకం లా మిగులుతుందని ట్వీట్ చేసి ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ కి మరియు నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు తెలియచేసాడు.