బంగ్లాదేశ్: స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఐసిసి బౌలింగ్ నిషేధం విధించింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధమని నిర్ధారణ కావడంతో, అన్ని ఫార్మాట్లలోనూ బౌలింగ్ చేయకుండా ఆంక్షలు అమలు చేసింది.
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఫిర్యాదు ఆధారంగా జరిపిన పరీక్షల్లో అతడి మోచేయి 15 డిగ్రీలకంటే ఎక్కువ వంగినట్లు తేలింది.
ఈ నివేదిక ఆధారంగా మొదట ఇసిబి చర్యలు తీసుకోగా, అనంతరం ఐసిసి ఈ నిర్ణయాన్ని అమలు చేసింది.
షకీబ్, బౌలింగ్ చేయడానికి అనర్హుడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) తెలిపింది. అయితే, అతడు బ్యాటింగ్ చేయడానికి మాత్రం అనుమతి ఉంది.
తన కెరీర్‌లో 71 టెస్టుల్లో 4,609 పరుగులు, 246 వికెట్లు, వన్డేల్లో 7,570 పరుగులతో 317 వికెట్లు, టీ20ల్లో 2,551 పరుగులతో 149 వికెట్లు తీసుకున్న షకీబ్ ఈ చర్యతో అతడి కెరీర్ భవిష్యత్తుపై మేఘాలు కమ్ముకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన షకీబ్‌పై ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.