టాలీవుడ్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చారిత్రక కథల్ని అద్భుతంగా తెరకెక్కించగల నిపుణుడు ఎవరంటే వినపడే పేర్లలో ఖచ్చితంగా గుణ శేఖర్ పేరు వినిపిస్తుంది. బాల రామాయణం, రుద్రమ దేవి లాంటి సినిమాలని రూపొందించిన ఆయన మరి కొద్ది రోజుల్లో ప్రతాప రుద్రుడు సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు. ప్రతాప రుద్రుడు సినిమాకి ఇంకొంత టైం కావాలని ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ అనే మరో చారిత్రాత్మక సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుంది. దాదాపు రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా టీం జెట్ స్పీడ్ తో సమంత పార్ట్ షూట్ కంప్లీట్ చేసినట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్ మెయిన్ పాత్ర కాబట్టి షూటింగ్ కూడా పూర్తి అయినట్టే అని చెప్పుకోవాలి.
ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లోనే చాలా కస్టపడి ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ తో అన్ని విధాలుగా సెట్ చేసుకుని షూటింగ్ మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసారు గుణ టీం. ఒక రకంగా ఒక పీరియాడిక్, చారిత్రాత్మక సినిమా ఇంత తొందరగా ఫినిష్ చేయడం ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో బన్నీ కూతురు అల్లు ఆర్హ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ మిగిలి ఉంది. సినిమా పీరియాడిక్ మరియు హిస్టారిక్ నేపథ్యం ఉన్న కథ కాబట్టి గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండబోనుండి. ఈ సినిమా గుణ టీం వర్క్స్ మరియు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గుణ శేఖర్ మరియు దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.