హైదరాబాద్: షంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికలకు మరి కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చింది జీఎంఆర్ సంస్థ. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించే వారి కోసం అదనపు సౌకర్యాలు ప్రైమ్ సర్వీసుల పేరిట త్వరలో అందించబోతోంది.
ఈ జీఎంఆర్ ప్రైమ్ సేవల కోసం జీఏమార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ద్వారా ఫోన్‌లో నుంచే ఈ సర్వీసులను ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. దీనిలో ఎక్స్‌ప్రెస్ చెక్ ఇన్, పర్సనలైజ్డ్ ప్యాసింజర్ అసిస్టెన్స్ సర్వీస్, పోర్టల్ సర్వీస్, లాంజ్ యాక్సెస్, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ తదితర సేవలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
సదరు విమానంలో ఏ క్లాసులో టిక్కెట్ బుక్ చేసుకున్నారు అనే అంశాలతో సంబంధం లేకుండా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ గుండా ప్రయాణం చేసే వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ రెండు టెర్మినళ్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటి.